VSP: ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు కే.సన్యాసిరావు పాము కాటుతో మృతి చెందడంతో కుటుంబానికి పార్టీ నష్ట పరిహారాన్ని అందజేసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ నాగబాబు ఆదివారం సన్యాసిరావు భార్య లక్ష్మికి రూ.5 లక్షలు నష్టపరిహారం చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సిఫార్సు మేరకు నష్ట పరిహారం మంజూరైంది.