GDWL: జిల్లాలో త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల కోసం మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఆదివారం గద్వాల ఆర్డీవో కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో అలివేలు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఈ స్థానాలను ఎంపిక చేశారు. 2019 సాధారణ ఎన్నికలను అనుసరించి, అన్ని కేటగిరీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశారు.