సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఐదు రోజులుగా నిలిచిపోయిన బస్సు సేవలు పుట్టపర్తిలో సోమవారం నుంచి పునరుద్ధరించబడ్డాయి. ఆర్టీసీ బస్సులు పుట్టపర్తి బస్టాండ్ నుంచి యథావిధిగా బయలుదేరుతున్నాయి. బెంగళూరు సహా ఇతర ప్రాంతాలకు కూడా బస్సులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.