TG: ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హౌసింగ్ కార్పొరేషన్ MD PV గౌతమ్ హెచ్చరించారు. అమ్మినా/అద్దెలకు ఇచ్చినా ఇల్లు రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. ఇప్పటికే GHMC పరిధిలో సర్వే చేశామని, త్వరలోనే జిల్లాల్లో కూడా చేస్తామని తెలిపారు. పేదల నివాసం కోసమే ఇచ్చామని, అమ్ముకోడానికి కాదన్నారు.