BHNG: బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46 ను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. జీవో 46 ను వ్యతిరేకిస్తూ.. నిన్న చౌటుప్పల్లోని బీసీ కార్యాలయంలో జీవో ప్రతులను చించి దగ్ధం చేస్తూ బీసీ నాయకులు నిరసన తెలిపారు.