PPM: ఇటీవల నాగావళి నదిలో గల్లంతై మృతి చెందిన కురుపాం మండలం బియ్యాల వలసకు చెందిన మండంగి అన్నపు రాయుడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆ కుటుంబానికి తక్షణమే నష్టపరిహారంగా పది లక్షలు ఇవ్వాలన్నారు.