సినిమాలను పైరసీ చేసిన కేసులో iBOMMA రవి 5 రోజుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. అయితే కస్టడీ విచారణలో రవి తమకు ఏ మాత్రం సహకరించట్లేదని, ఏం అడిగినా ‘గుర్తు లేదు, మర్చిపోయా’ అని చెబుతున్నాడని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి రవిని కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇవాళ HYD నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.