SRD: మండల కేంద్రమైన కంగ్టిలో ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరవుతున్నట్లు ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు. మండలంలో మొత్తం 9386 ఇందిరమ్మ చీరలు వచ్చినట్లు చెప్పారు. కావున మండల ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.