కృష్ణా: విజయవాడలోని కలెక్టరేట్లో సోమవారం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా ఆదివారం తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వినతులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.