ఆసియాకప్ రైజింగ్ స్టార్స్-2025 ఛాంపియన్గా పాకిస్తాన్-A అవతరించింది. ఫైనల్లో బంగ్లాదేశ్-Aపై పాక్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. తొలుత ఇరు జట్లూ 125 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. ఆరు పరుగులు చేసింది. అనంతరం నాలుగు బంతుల్లోనే 7 పరుగులు చేసిన పాక్ విజేతగా నిలిచింది.