TPT: తిరుపతి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పంచమి తీర్థం (చక్రస్నానం) సందర్భంగా భద్రతా బందోబస్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.