TPT: చంద్రగిరి MLA పులివర్తి నాని సోమవారం మల్లంగుంట గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ – ఇంటింటి ప్రచారం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతు సంక్షేమ పథకాల రెండో విడత ప్రయోజనాలను ప్రజలకు వివరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి పట్టణంలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం అభివృద్ధి పనులకు సతీసమేతంగా హాజరుకానున్నారు.