KDP: ప్రొద్దుటూరులోని ఉప్పాగు యానాది కాలనీలో జూదం ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.18,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై రాజు తెలిపారు. సమాచారం మేరకు ఉప్పాడ యానాది కాలనీలో జూదరుల స్థావరాలపై దాడులు నిర్వహించామన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ పర్యవేక్షణలో అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.