W.G: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.