ELR: జాతీయ NCC దినోత్సవం సందర్భంగా నూజివీడులోని ఓ స్కూల్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు ఆదివారం నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు విద్యార్థుల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తాయో ఉదాహరణలతో వివరించారు.