NRPT: జిల్లాలోని క్రిస్టియన్పల్లి వద్ద NH రోడ్డు విస్తరణ పనుల కారణంగా 1200 ఎంఎం పైప్ లైన్ మార్చే పనులు చేపడుతున్నందున సోమవారం 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. నారాయణపేట జిల్లాలోని 258 గ్రామాలకు, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర మున్సిపాలిటీలకు పూర్తిగా, మహబూబ్ నగర్ పురపాలకానికి పాక్షికంగా నీటి సరఫరా నిలిచిపోనుందని అన్నారు.