MBNR: జిల్లాలో నవంబర్ మొదటి వారం నుంచి 190 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు జరుగుతోంది. ఆదివారం కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు 13,705 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2,394 మంది రైతుల నుంచి సేకరించారు. 320 మంది రైతులకు రూ.4.33 కోట్లు ఎంఎస్పీ చెల్లింపులు జారీ చేశారు.