KRNL: వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జడ్పి హెచ్‌ఎస్‌లో వోసా అప్రిషియేషన్ అవార్డు ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక VOSA అప్రిషియేషన్ అవార్డును అందజేశారు.