సూర్యాపేట రూరల్ మండలం యల్కారం టోల్ గేట్ సమీపంలో రోడ్డు మధ్యలో వేసిన వడ్ల రాశిని బైక్ ఢీకొనడంతో తుంగతుర్తి ప్రాంతానికి చెందిన రవికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం వెంటనే టోల్ సిబ్బంది, వాహనదారులు స్పందించి సీపీఆర్ చేసి రవిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ధాన్యాపు రాశుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు.