SKLM: ఇవాళ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పలాస ఎంపీడీవో వసంత కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సచివాలయం సిబ్బంది ప్రతి రైతు వద్దకు వచ్చి, వ్యవసాయం ఎలా ఉంది ఆదాయం లాభసాటిగా ఉందా లేదా అనే విషయాన్ని ఆరా తీస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు పంపించిన లేఖను రైతులకు అందజేయనున్నామని పేర్కొన్నారు.