MBNR: జిల్లాలోని స్థానిక సత్యసాయి ఆలయంలో ఆదివారం సాయంత్రం భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాలమూరు ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మానవ సేవే మాధవ సేవ అని చాటిచెప్పిన మహనీయుడు బాబా అని, ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఎంపీ అరుణ తెలిపారు.