తూ.గో: కోరుకొండ సబ్ స్టేషన్ పరిధిలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ జేపీబీ నటరాజన్ తెలిపారు. మునగాల, శ్రీరంగపట్నం గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.