CTR: ఓ మహిళను కట్నం కోసం వేధించడంతో పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. SI హరిప్రసాద్ వివరాల మేరకు.. శాంతినగర్‌లో కాపురం ఉంటున్న మిస్బాకు ఏడాది క్రితం రియాజ్‌తో పెళ్లి జరిగింది. ఏడాది పూర్తి కాకముందే భర్త రియాజ్, ఆడబిడ్డ రేష్మ, బావ ఖాజాపే, మామ ఖాదర్ బాషా అదనపు కట్నం కోసం ఆమెను వేధించేవారు. అత్తారింటి వేధింపులు భరించలేక మిస్బా పోలీసులను ఆశ్రయించగా SI కేసు నమోదు చేశారు.