తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యతను ఇస్తామని టీవీకే అధినేత విజయ్ వెల్లడించారు. అలాగే అందరికీ సొంత ఇల్లు, ద్విచక్రవాహనం, ఇంటికో పట్టభద్రుడు ఉండే విధంగా విద్యావిధానంలో సంస్కరణలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంట్లో ఒకరికి శాశ్వత ఆదాయం, శాంతి భద్రతల విషయంలో అసలు రాజీ పడమని తెలిపారు. మిగతా వాళ్లలాగా ప్రజలను మోసగించనన్నారు.