KNR: కరీంనగర్ భాగ్యనగర్ బస్తీ ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమంలో భాగంగా జ్యోతినగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైందవ చైతన్యమే జగతికి శ్రీరామ రక్షణ అనే పంచ పరివర్తన స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం స్వయం సేవకులు పలు హిందూ కుటుంబాలను కలుసుకొని ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా సంఘ శతాబ్ది కార్యకలాపాలను వివరించారు.