KRNL: పార్టీ కోసం అంకిత భావంతో కలిసి పని చేస్తామని కర్నూలు మాజీ డీసీసీ అధ్యక్షుడు కే బాబురావు ప్రకటించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తన సస్పెన్షన్ను ఎత్తివేసినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు.