EG: వచ్చే ఏడాది మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లా స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం. అమలకుమారిని 9849939487 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.