SKLM: అర్జీ దారుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆదివారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీ దారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు చరవాణి ద్వారా పరిష్కారాన్ని సూచించారు.