CTR: బైక్పై వెళ్తున్న ఓ మహిళను టిప్పర్ ఢీకొట్టడంతో ఆమె మృతి చెందిన ఘటన వి.కోట మండలం గుండ్లపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలిని వరలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. ఆమెను వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.