ELR: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఐ.ఎస్ జగన్నాధపురం చేరుకొని డిప్యూటీ సీఎంతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.12.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వెలుతున్నట్లు తెలిపారు.