తైవాన్ విషయంలో సైనిక జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ జపాన్ నూతన ప్రధాని సనై తకాయిచి చేసిన వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. టోక్యో తన హద్దులను దాటిందని (రెడ్ లైన్ దాటిందని) చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మండిపడ్డారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని వాదిస్తున్న చైనా, మేం దీటుగా స్పందిస్తాం’ అని జపాన్ను హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది.