ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని 30వ వార్డు లో ఆదివారం వైసీపీ ఇంఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలు విద్య, వైద్యం కోల్పోతారన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.