BHNG: యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో MLA బీర్ల ఐలయ్య పాల్గొని చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వం మహిళలను ఆడపడుచులుగా భావించి, వారు ఆకాశమంత ఎత్తున ఎదగాలనే ఉద్దేశంతో నీలిరంగు చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.