TG: సీఎం రేవంత్ రెడ్డి, MLA సంజయ్ కుమార్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేవలం పార్టీ ఫిరాయించిన వారికే గుర్తింపు ఇస్తున్నారని విమర్శించారు. జగిత్యాలకు MLA సంజయ్ చేసిందేమీ లేదని.. పదేళ్లు MLAగా ఉండి ఏం చేశారని మండిపడ్డారు.