ADB: ఈనెల 24, 25వ తేదీల్లో సోయా కొనుగోళ్లు నిలిపివేసినట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ అధికారులు ఆదివారం తెలియజేశారు. పలు సాంకేతిక కారణాలతో కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. తదుపరి కొనుగోలు తేదీని ఒకరోజు ముందుగానే రైతులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని అధికారులు కోరారు.