JN: లింగాల గణపురం మండలం కుందారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట వేద పండితులు కృష్ణమాచారి చేతుల మీదుగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం చేశారు. గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా తోడుండాలని వేద పండితులు ఆశీర్వదించారు.