సత్యసాయి: సత్య సాయి బాబా శతజయంతోత్సవాలు దిగ్విజయమైన సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రముఖులు హాజరైన ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించిన కూటమి ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు, జిల్లా యంత్రాంగం సహకారాన్ని ఆమె కొనియాడారు.