VZM: ఏపీ సీఎం చంద్రబాబు రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కళా వెంకటరావు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది రైతులు నుంచి ధాన్యం తీసుకొని 24 గంటల్లో బిల్లులను ప్రభుత్వం చెల్లించిందని, నేడు రైతుల ఖాతాలో నగదు జమయ్యేలా ఏర్పాట్లు జరిగాయన్నారు. మొక్కజొన్న, అరటి రేటు తగ్గడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు.