SKLM: సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో ప్రతిపాదించిన థర్మల్ పవర్ ప్లాంట్ తీవ్ర పర్యావరణ సమస్యలకు దారితీస్తుందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి అన్నారు. ఆదివారం సరుబుజ్జిలిలోని పలు గ్రామాలలో పవర్ ప్లాంట్ వలన కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనెల 25న నిర్వహించనున్న ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు.