ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి బాల, బాలికల జూనియర్ వాలీబాల్ జట్లను ఫైనల్ చేశారు. బాలుర నుంచి 16 మంది క్రీడాకారులను, బాలికల నుంచి 16 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు పోటీల ఆర్గనైజర్ సందీప్ తెలిపారు. వీరంతా సిరిసిల్ల వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.