NLR: జిల్లాపరిషత్ అంటే అన్నీ శాఖలకు పెద్దన్నలాంటిది. ఇందులో CEO నుంచి స్వీపర్ వరకు 1,247 పోస్టులు ఉండాలి. జిల్లాలో వీటిలో 929 పోస్టులు మాత్రమే భర్తీ కాగా 338 ఖాళీగా ఉన్నాయి. ప్రధానమైన MPDO పోస్టులు 46 ఉండాల్సి ఉండగా 16 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు-133, వాచ్ మెన్లు-98, వాటర్ మెన్లు-39 వరకు ఖాళీగా ఉన్నాయి.