IND vs SA టెస్టులో సౌతాఫ్రికా ప్లేయర్ ముత్తుసామి అద్భుత ప్రదర్శన చేశాడు. 2019లో అరంగేట్రం చేసిన తర్వాత దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత తొలి టెస్ట్ సెంచరీ (109) చేశాడు. అలాగే ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు దిగి సెంచరీ చేసిన SA ప్లేయర్గా నిలిచాడు. గతంలో 2019లో డికాక్ శతకం బాదాడు. అలాగే భారత్, పాక్, బంగ్లాలో 50+ స్కోర్లు చేసిన నాలుగో SA ఆటగాడిగానూ ఘనత సాధించాడు.