కడప: రాష్ట్ర షేక్ వెల్ఫేర్ బోర్డు సొసైటీ ఛైర్మన్గా వి.ఎస్. ముక్తియార్ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ప్రభుత్వ జీవో వెలువడే అవకాశం ఉంది. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన కార్యాలయంలో పలువురు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు తాహిర్ హుస్సేన్, పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం పాల్గొన్నారు.