కరీంనగర్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలల్లో NMMS పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి మొండయ్య తెలిపారు. పరీక్షకు 1,507 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,430 మంది హాజరయ్యారని తెలిపారు. 7 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు 02 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించబడినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలల్లో అవకతవకలు జరగలేదు అన్నారు.