GNTR: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆదివారం పట్టణంలోని మాయాబజార్లో డ్రెయిన్ పనులను పరిశీలించారు. వర్షాల సమస్య తగ్గించే ఈ డ్రెయిన్ పనులను నాణ్యతలో రాజీపడకుండా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లను వేగంగా నిర్మిస్తోందని ఆయన తెలిపారు.