NRML: మండల కేంద్రాల్లోని భవిత కేంద్రాల్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఫిజియో థెరపిస్ట్ (8), స్పీచ్ థెరపిస్ట్ (8), ఆయా (కేర్ గివింగ్ వాలంటీర్) (10) పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన వారు DEC 1లోపు బయోడాటా, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్లు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.