ASF: సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కాగజ్ నగర్ ఎస్సై సందీప్ అన్నారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.