ADB: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రోగ్రాం ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ కృషి చేస్తుందని జిల్లా కార్యదర్శి జగన్ సింగ్ అన్నారు. పట్టణంలోని KCP కాలనీకి చెందిన పలువురు ఆటో కార్మికులు TUCIలో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టాలని కోరారు.