NLR: వింజమూరు మండల పరిధిలోని తమిదపాడులో బెల్టు దుకాణంపై కలిగిరి సర్కిల్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.