ASF: ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లికి చెందిన లలితను చంపుతానని బెదిరించిన రామోజీ ,అతని భార్యపై కేసు నమోదు చేసినట్లు CI బాలాజీ వరప్రసాద్ ప్రకటనలో తెలిపారు. రామోజీ, అతని భార్య లలితకు చెందిన ఎకరం భూమిలో అక్రమంగా ఇల్లు కట్టుకోవడానికి తవ్వకాలు ప్రారంభించారు.అడ్డుకోవడానికి వెళ్లిన లలితను చంపుతానని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.